KNR: 108 అంబులెన్స్ వాహనాన్ని ఉమ్మడి మేనేజర్ బి. నాగేందర్, జగిత్యాల మేనేజర్ ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని అత్యవసర వైద్య పరికరాల పనితీరును, రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ మల్లేశం, పైలట్ శేఖర్, సిబ్బంది, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.