TG: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు రాష్ట్రంలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరపున వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా సాయి.. 10 మంది MLAల సంతకాలు లేకుండా నామినేషన్ వేశారు. స్క్రూటినీలో ఆ నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంది.