HYD: శివారు కొత్వాల్ గూడలో అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. MLA గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసిన ప్రభుత్వం పొంగులేటిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నిలదీశారు. ప్రతిపక్షానికి ఒక న్యాయం అధికార పక్షానికి మరో న్యాయమా? అని డిమాండ్ చేశారు.