PDPL: జిల్లాలో CMR బియ్యం డిఫాల్ట్ మిల్లర్లకు ప్రభుత్వం 3 నెలలు గడువు పొడిగించిందని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. రైస్ మిల్లర్లు, TG సివిల్ సప్లై కార్పోరేషన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం 90 రోజుల్లోపు సన్న బియ్యం లేదా నగదు రూపంలో చెల్లించాలని పేర్కొన్నారు. బకాయి మొత్తానికి 125% తోపాటు 12% వడ్డీతో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.