NRPT: నారాయణపేట పట్టణంలోని పాత బస్టాండ్, అంబేడ్కర్, సింగారం కూడలిలో, ఎర్రగుట్ట వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా శనివారం రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య తెలిపారు. వాహనాలు వేగంగా నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. దీంతో వేగాన్ని నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.