NLG: నల్లగొండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ ఆర్డీవోకు వినతిని సమర్పించారు. నాలుగేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం, మంత్రి నిర్లక్ష్యం వహించడం సరికాదని సీపీఎం నేత ఎండీ సలీం విమర్శించారు. కలెక్టర్ చొరవ చూపి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.