భాగ్యనగరంలో వినూత్న ‘పారా నార్మల్ టాక్స్’ ఈవెంట్ యువతను ఆకర్షిస్తోంది. దెయ్యాలు, ఆత్మల ఉనికిపై ఆసక్తి, సందేహం ఉన్నవారిని ఒక్కచోట చేర్చి వారి అనుభవాలను పంచుకునేలా చేయడమే దీని ఉద్దేశం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వారాంతాల్లో జరిగే ఈ ‘థాట్ ప్రొవోకింగ్ నైట్’కు 18+ ఏళ్లవారికే అనుమతి. ఇప్పుడు నగరంలో అందరి నోటా దీనిపైనే చర్చ!