ASR: డుంబ్రిగుడ మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో ఈనెల 31న సామాజిక తనిఖీ ప్రజా వేదికను నిర్వహించనున్నామని ఏపీవో సంగంనాయుడు తెలిపారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో జరుగుతున్న 26వ విడత సామాజిక తనిఖీని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉపాధి శ్రామికులు హాజరవ్వాలని కోరారు.