GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శైలజ శ్రీనివాస్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ నందిమల్ల విజయ్ కుమార్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టరును గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రెన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.