KMR: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శనివారం మద్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో పర్యటించారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేద కుటుంబాల్లో సౌభాగ్యం కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. లబ్ధిదారురాలు చాకలి జయశ్రీ నూతన గృహాన్ని ఆయన స్వయంగా ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.