VZM: జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి జీవ శాస్త్రం పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం 22,969 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,905 మంది హాజరయ్యారన్నారు. కేవలం 64 మంది విద్యార్ధులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు.