AP: 2014-19లో అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు పనిచేశారని మంత్రి సవిత కొనియాడారు. ‘చంద్రబాబు కోరిక మేరకు రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. ఈ ఇంత మొత్తం భూసేకరణ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే. రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నా అని నాడు జగన్ చెప్పారు. మూడుముక్కలాట ఆడి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారు’ అని విమర్శించారు.