TG: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తోందని మంత్రి సీతక్క అసెంబ్లీలో ఆరోపించారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ‘అష్టదిగ్బంధ పాలకుల’ వలె వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.