KRNL: చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామంలో వైసీపీ నాయకుడు కొండ్ల పెద్ద హనుమంతు గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు MLA బుసినే విరుపాక్షి ఇవాళ భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్య పడకుండా ఉండాలని ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.