BDK: ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాల కరపత్రాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం భద్రాచలం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. వేడుకలకు తాను తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.