JGL: హిందీ అనువాదం భారతీయ ఆత్మను నిలబెట్టగలదని ప్రొఫెసర్ పఠాన్ రహీమ్ ఖాన్ అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ద్విదినాల హిందీ అనువాద శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు అనువాదం ప్రాముఖ్యతను గురించి వివరించారు.