MHBD: కేసముద్రం మండలం బెరువాడ–పెనుగొండ మధ్య రైస్ మిల్లువద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పూజారి తన ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.