దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 2 లక్షల మార్కును దాటింది. దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడంతో పాటు దిగుమతులు మెరుగుపడటం పన్ను ఆదాయానికి దోహదపడ్డాయని కేంద్రం వెల్లడించింది. మార్చి నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు 8.8 శాతం పెరిగి రూ. 2,00,064 కోట్లు నమోదయ్యాయి.