VKB: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రేపు పరిగి మున్సిపల్ పరిధిలోని చికెన్, మటన్ షాపులన్నీ మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మాంస విక్రయ కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు అందజేసినట్లు తెలిపారు.