ADB: మహిళల, చిన్నారుల భద్రతకు మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరుగుతుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలియజేశారు. అతివలను అల్లరి చేసే ఆకతాయిల పని పట్టేందుకు “షీ టీం” పనిచేస్తుందని సూచించారు. మహిళలు ఇబ్బందులకు గురైతే డయల్ 100 లేదా 8712659953 నెంబర్ ద్వారా షీ టీంను సంప్రదించాలని కోరారు.