ADB: ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. హోమియోపతి వైద్య పితామహుడు డా. శామ్యూల్ హనీమన్ 271వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవ’ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. హోమియోపతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.