ELR: ఏలూరులో రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్ బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విలువైన ప్రాణాలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.