KMM: వైరా మున్సిపాలిటీలో 13వ వార్డులోని పశువుల ఆసుపత్రి ప్రాంగణంలోకి విద్యుత్ శాఖ కార్యాలయాన్ని తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వైస్ ఛైర్మన్, కౌన్సిలర్ ముళ్ళపాటి విజయ సీతారాములు విద్యుత్ శాఖ డీఈ రమేష్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు ఇతర వసతులపై క్షేత్రస్థాయిలో చర్చించి, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.