TG: ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా టారిఫ్ ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం వినియోగదారులకు ముఖ్యమైన ఉపశమనంగా ప్రస్తుత విద్యుత్ చార్జీల్లో ఎలాంటి పెంపు చేయలేదని కమిషన్ స్పష్టం చేసింది. అయితే పంపిణీ సంస్థల అంచనాలను భారీగా తగ్గించిన కమిషన్, రాబడి లోటును పూడ్చేందుకు ప్రభుత్వ సబ్సిడీని ఖరారు చేసింది.