AP: భీమిలి MLA గంటా శ్రీనివాసరావును స్టార్ డైరక్టర్ సుకుమార్ ఎంవీపీ కాలనీ నివాసంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశాడు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించుకున్నారు. విశాఖ సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశమని పేర్కొన్నారు. సుకుమార్‌ను ఘంటా శాలువా కప్పి సన్మానించారు. ఆయనతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని ఉన్నారు.