AP: జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని TDP నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. కేవలం 11 సీట్లు ఇచ్చారన్న కోపంతో ప్రజలపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రైతులపై జగన్ కురిపిస్తున్న మొసలి కన్నీళ్లను ఎవరూ నమ్మరని, అమరావతి రైతులను CM చంద్రబాబు ఎప్పుడూ గౌరవిస్తారని పేర్కొన్నారు. రాజధానికి చట్టబద్ధత లభించి రైతులు ఆనందంగా ఉంటే జగన్ చూడలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.