ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్‌ను లక్నో ప్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదానంలో మందలించిన ఘటనపై మహ్మద్ షమీ స్పందించాడు. ‘జట్టుపై పెట్టుబడి పెట్టినప్పుడు ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించడం సహజమే. అది యజమానికి ఉండే ‘పొజెసివ్‌నెస్’. అందులో తప్పేమీ లేదు’ అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం షమీ లక్నో జట్టులో భాగమైన సంగతి తెలిసిందే.