GDWL: వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడకుండా సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సలహాలు, సూచనలు తెలియజేయాలన్నారు. దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.