KRNL: కోసిగి మండల పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ రవాణాను ఎక్సైజ్ అధికారులు ఇవాళ అడ్డుకున్నారు. ఆర్లబండ గ్రామానికి చెందిన ఉడెం ఉసేని అనే వ్యక్తి బైక్పై మద్యం తరలిస్తుండగా కడదొడ్డి క్రాస్ వద్ద అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6 బాక్సులలో 576 టెట్రా ప్యాకెట్ల ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు