W.G: అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. రూ. 68.8 లక్షలతో మంచినీటి వాటర్ ట్యాంక్, రూ. 38 లక్షలతో లక్ష్మీనారాయణపురం నుంచి చలివేంద్ర చెరువు వరకు రోడ్డు, రూ. 14 లక్షలతో గ్రామంలో మరో సీసీ రోడ్డు పనులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో లక్షల కోట్ల సంక్షేమం అందిస్తుందన్నారు.