KMM: కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని CITU జిల్లా నాయకులు మాధవరావు అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం లేబర్ కోడ్ల జీవో పత్రాలను దగ్ధం చేశారు. కార్పొరేట్ సంస్థల కోసం కేంద్రం లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని పేర్కొన్నారు.