BDK: రేషన్ కార్డు దారుల్లో కొత్త భయం పట్టుకుంది. IT రిటర్న్స్ దాఖలు చేసేవారి రేషన్ కార్డు రద్దవుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. IT రిటర్న్స్ దాఖలు చేసిన వారిపై GPOలు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. చాలామంది ఆదాయంతో సంబంధం లేకుండా పర్సనల్, హోమ్ లోన్ల కోసం, ఏదైనా పరిహారం పొందడం వంటి విషయాల్లో ITR ఫైల్ చేస్తుంటారు.