పల్నాడు: ప్రజల ముంగిటకే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేపట్టింది. రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్న పాలెంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాల తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు.