మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పదవ డివిజన్లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన డివిజన్ సభకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.