కర్నూలు: గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి స్పష్టం చేశారు. పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో రూ. 5 కోట్ల వ్యయంతో ఆర్అండ్బీ రహదారి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దకడబూరు మండలంలో వివిధ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.