ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి ర్యాలీ ఘనంగా జరిగింది. ర్యాలీలో పాల్గొన్న భక్తుల కోసం వెడ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు 5000 మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. అంగడిబజార్, ఐబీ చౌరస్తాలో రెండు స్టాల్స్‌లో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. అక్కడ హనుమాన్ భక్తులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.