KMR కలెక్టరేట్లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.