NRML:గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామసభల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ప్రతి రెండు నెలలకు గ్రామసభలు నిర్వహించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.