PDPL: జిల్లాలోని మైనారిటీ నిరుద్యోగ యువత విదేశాలలో ఉపాధి అవకాశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఖతార్, ఒమన్, జర్మనీ, గ్రీస్ దేశాలలో పురుషులు, మహిళలకు వివి కోధ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అర్హులైన వారు ధ్రువీకరణ పత్రాలతో కలెక్టరేట్లోని 232 రూము నందు ఉ. 10:30 నుంచి సా. 5:00 లోపు సంప్రదించాలని సూచించారు.