KRNL: ఎమ్మిగనూరు సబ్ డివిజన్ డీఎస్పీ భార్గవి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా చేసుకుని అక్రమంగా బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కఠిన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.