AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పాత గోడ దెబ్బతిని రూ.440 కోట్లు వృథా అయ్యాయని, నిపుణుల సూచనలతో కొత్తది నిర్మించామని ప్రభుత్వం తెలిపింది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఇంజినీర్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా సన్మానించారు.