BHPL: టేకుమట్లలో చేనేత కార్మికుల సమస్యలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టెండర్ విధానాన్ని రద్దుచేసి చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు.