నిజామాబాద్ నగరంలోని వీర హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ర్యాలీని కంఠేశ్వర్ ఆలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగరంలో విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్దళ్ హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు.