SRD: సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదాశివపేట మండలానికి చెందిన 26 మంది, లబ్ధిదారులకు మొత్తం రూ.11,60,500 విలువైన చెక్కులను పంపిణి చేసారు.