MNCL: భీమిని మండలం చెన్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఏల్పుల స్వప్న అనే గర్భిణీకి గురువారం శ్రీమంతం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ జమీల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు మండల RI కిషన్ రావు, సర్పంచ్ జావిద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.