HNK: జిల్లా వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న లావాదేవీలు, డాక్యుమెంట్ల నమోదు ప్రక్రియలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజల నుంచి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అధికారులు రికార్డులు, ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.