KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) కు చెందిన రిషాపు రూములకు గురువారం ఆలయం ఆవరణలో అధికారులు వేలం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ, దేవాలయాల ఇన్స్పెక్టర్ కిరణ్ కుమారెడ్డిల ఆధ్వర్యంలో వేలం ఏర్పాటుచేశారు. గడువు ముగిసిన షాపు, రూములకు వేలం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. వేలం ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు వివరించారు.