MNCL: కోటపల్లి మండలం నాగంపేట గ్రామంలోని పాత పాఠశాల భవనం స్థలం కబ్జా కాకుండా కాపాడాలని సర్పంచ్ విశాల్ ప్రసాద్ తివారి కోరారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని 2019లో అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి కూల్చివేసినట్లు తెలిపారు. ఇప్పుడు దాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారన్నారు.