భారత టెలికాం రంగం పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రాయ్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 2026 చివరి నాటికి దేశంలోని మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 132.13 కోట్లు చేరుకుంది. కేవలం ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో 7.31 మిలియన్ల కొత్త చందాదారులు నెట్‌వర్క్‌లో చేరారు. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో చోటుచేసుకున్న భారీ వృద్ధి ఈ విజయానికి కారణంగా నిలిచింది.