వనపర్తి పట్టణంలోని 37 పరీక్షా కేంద్రాల్లో గురువారం జరిగిన పదవ తరగతి సోషల్ పరీక్షకు 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని తెలిపారు. మొత్తం 7224 మంది విద్యార్థులకు గాను, రెగ్యులర్ విభాగంలో 13 మంది పరీక్ష రాయలేదు అని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసి, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించామన్నారు.